బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు కలియుగ వరదుడు. వక్షస్థలంలో లక్ష్మి నివాసితుడైన శ్రీశ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ప్రసాదాలు ఎన్ని. ఒక్కొకో రోజు స్వామివారికి ప్రత్యేకంగా ప్రసాదాలను నివేదిస్తారు. స్వామి వారికీ సమర్పించే ఒక్కో ప్రసాదం వాటికి అవే సాటిగా ఉంటాయి. అందరికి తెలిసిన లడ్డు, వడ, అప్పాలతో పాటుగా…. అతి కొద్దిమందికే తెలిసిన దోష, జిలేబి, మురుకు, పోలిలను ప్రత్యేకంగా నివేదిస్తారు. ప్రస్తుతం టీటీడీ జిలేబి-మురుకు ధరలను రూ. 100/- నుంచి రూ.500/- కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.స్వామి వారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాన్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిల శాసనాల్లో ఎక్కువ బాగం ఏ ఏ రాజు ఏ ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పిచారని, ఎన్ని మాన్యాలు ఇచ్చారనే వివరాలే అధికంగా ఉంటాయి. దీనిబట్టే చెప్పవచ్చు స్వామి వారి నైవేధ్యంకు ఎంత విశిష్టత ఉందోనని, 1933వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజ నియమాల ప్రకారం, ఆగమ శాస్త్రోక్తంగా స్వామి వారికి మిరాశి అర్చకులు నైవేద్యం సమర్పిస్తారు. శ్రీ వేంకటేశ్వరునికి త్రికాల నైవేద్యంవితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు శుక్ర వారలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు.శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. భగవంతుని దర్శనం అనంతరం అయన అనుగ్రహంగా భక్తులు భావించేది నైవేద్య ప్రసధమే. వెంకన్న దర్శన బాగ్యం అనంతరం శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులు శ్రీవారి అనుగ్రహంగా భావిస్తారు. భక్తులకు తెలియని ఎన్నో ప్రసాదాలను మూలమూర్తికి నివేదిస్తుంటారు. నిత్యం నిర్వహించే కైంకర్యాలను బట్టి స్వామి వారికి నివేదన సమర్పిస్తారు అర్చక స్వాములు. పాలు, వెన్న మొదలుకొని పొంగళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి వంటి ఎంతో రుచికరమైన ప్రసాదాలను స్వామి వారికి నైవేద్య సమర్పణ చేస్తారు. కమ్మటి దోశలు ఘాటైన మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారని కొద్ది మందికి మాత్రమే తెలుసు.శేషాద్రి నిలయునికి నిత్యం వైభవంగా నిర్వహించే ఉత్సవాలోనే కాదు నైవేద్య సమర్పణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వైఖానస అగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికి కట్టెల పొయ్య మీదే ప్రసాదాలను తాయారు చేస్తారు. విమాన ప్రదిక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీ వేంకటేశ్వరునికి నైవేధ్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామి వారికీ నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రీవారికి గంటానాధాల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత శ్రీ వారి ఆలయంలోని పరివర దేవత మూర్తులకు, ఆలయం ఏదురుగా ఉన్న భేడి ఆంజనేయ స్వామి వారికీ నైవేధ్య సమర్పణ జరుగుతుంది. స్వామి వారికి 50 రకాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం అనంతరం చెక్కర పొంగలి, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, చిన్న లడ్డులను భక్తులకు అందిస్తారు. వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు… వడ, దోస, జిలేబి, పెద్ద లడ్డు, మురుకు, పెద్ద వడ, తదితర ప్రసాదాలను...
Read moreGovinda, Govinda, Govinda. Very clean and maintained laddoo prasadam counter. We had 10 tickets (Special darshan 300 Rs) and got 10 laddus (50 Rs each) for free (included in 300 Rs special darshan tickets.). There are many counters operated and there is no queue , takes 5 minutes to collect prasadam and come out. No rush no crowd. You can take extra laddus by paying cash/UPI/paytm immediately at the same window. Staff is very...
Read moreOn 21/8/23 I had been there 1st time to eat during my 35+ years of pilgrimage to Tirumala. The dining place was so clean & tidy with banana leaf food served. 1 Vegetable desert, 1 sweet desert, 1 gravy with rice, sambar, Rasam & lassi served. I felt guilty I have missed this food...
Read more